క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ వెంకటేశ్వర్లు అన్నారు. సింగరేణి సంస్థలో కారుణ్య నియామకాల ద్వారా ఎంపికైన అభ్యర్థులకు ఎంవిటిసిలో శిక్షణ ఇస్తున్నారు. గురువారం అభ్యర్థులతో జీఎం వెంకటేశ్వర్లు సమీక్ష నిర్వహించి, శిక్షణను సద్వినియోగం చేసుకొని, క్రమం తప్పకుండా విధులకు హాజరు కావాలన్నారు. ఈకార్యక్రమంలో ఎస్ఓటు జీఎం సత్యనారాయణ, ఎంవిటిసి మేనేజర్ మల్లన్న పాల్గొన్నారు.