పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు శనివారం హైదారాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే విజయ రమణరావు ధర్మపురి, రామగుండం ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మన్ కుమార్, మక్కాన్ సింగ్ ఠాకూర్ లతో కలిసి పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాలని సీఎంను కోరారు. ఈ కార్యక్రమంలో అన్నయ్య గౌడ్, మినుపాల ప్రకాష్ రావు, ఊట్ల వరప్రసాద్, సంతోష్ రావులు పాల్గొన్నారు.