భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ అధికారులను ఆదేశించారు. శనివారం పాలకుర్తి తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాలకుర్తి మండలం తహసిల్దార్ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ తనిఖీ చేసి పెండింగ్ ధరణి దరఖాస్తుల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. తహసిల్దార్ జ్యోతి ఉన్నారు.