జిల్లాలోని నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణతో గ్యారంటీ ఉపాధి అందించే దిశగా ప్రభుత్వం పటిష్ట కార్యాచరణ అమలు చేస్తుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. శనివారం టీ వర్క్స్ సీఈఓ జోగేందర్ తో కలిసి పెద్దపల్లి ఐటిఐ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టరేట్లో ఏటిసి కేంద్రాలకు టీ వర్క్స్ అందించే సహకారం, ఏటిసి కోర్సులతో యువతకు ఉపాధి అవకాశాల వివరాలతో కూడిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేశారు.