గ్రామీణ ఓటర్ జాబితా రూప కల్పనకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సంపూర్ణ సహకారం అందజేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కోరారు. బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో గ్రామీణ ఓటర్ల జాబితా రూపకల్పన పై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.