సుల్తానాబాద్: దేశానికి అంబేడ్కర్ చేసిన సేవలు అమూల్యమైనవి: ఎంపీ

81பார்த்தது
సుల్తానాబాద్: దేశానికి అంబేడ్కర్ చేసిన సేవలు అమూల్యమైనవి: ఎంపీ
సుల్తానాబాద్ మండల కేంద్రంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సోమవారం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు అమూల్యమన్నారు. విద్య, హక్కులు, సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. ఈతరం యువత అంబేద్కర్ ఆలోచనలు అనుసరించాలను పిలుపునిచ్చారు.

தொடர்புடைய செய்தி