వరి పంట కోసిన తరువాత వరి కొయ్యలను కాల్చితే రైతులకు నష్టమని వ్యవసాయ అధికారి ప్రత్యుష అన్నారు. మంగళవారం జూలపల్లిలో వరి పంట కోసిన పంట క్షేత్రాలను ఏఓ పరిశీలించారు. వరి కొయ్యలను కాల్చడం వల్ల భూమిలోని వ్యవసాయ మిత్ర పురుగులు, సూక్ష్మ జీవులు నశిస్తున్నాయన్నారు. కొయ్యలు కాల్చడం వలన భూ కర్బన పదార్థం స్థాయి తగ్గడంతో పాటు వాతావరణ కాలుష్యం ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.