108లో ప్రసవం.. తల్లీ బిడ్డ క్షేమం

73பார்த்தது
108లో ప్రసవం.. తల్లీ బిడ్డ క్షేమం
పెద్దపల్లి మండలం తుర్కల మద్దికుంట గ్రామానికి చెందిన కలవేన శారద సోమవారం పురిటి నొప్పులతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు 108కి సమాచారం అందించారు. హుటాహుటిన 108 సిబ్బంది చేరుకొని పెద్దపల్లి మాతాశిశు కేంద్రానికి తరలించేలోపే పురిటి నొప్పులు తీవ్రం కావడంతో ఎమర్జెన్సీ సిబ్బంది శ్రీనివాస్, హాబీబ్ చాకచక్యంగా వ్యవహరించి నిబంధనలనుసరించి ప్రసవం చేశారు. ఆమె పండంటి ఆడశిశువుకు జన్మనివ్వగా, ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.

தொடர்புடைய செய்தி