ముత్తారం మండలంలో పనిచేసే ఆరుగురు పంచాయతీరాజ్ సిబ్బందిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎంపీడీవో కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన కలెక్టర్ సిబ్బంది విధులకు గైర్హాజరును గమనించారు. బయోమెట్రిక్ అటెండెన్స్ రిజిస్టర్లు పరిశీలించగా, సిబ్బంది అనుమతి లేకుండా విధులకు డుమ్మా కొట్టడం గమనించి, నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ సస్పెండ్ చేశారు.