గ్రామపంచాయతీలలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించి అక్టోబర్ 10లోపు త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య అన్నారు. ఆదివారం పెద్దపల్లి మండలం అప్పన్న పేట ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ఫీల్డ్ విజిట్ ను డిపివో, డీఎల్పివో వేణుగోపాల్ పరిశీలించారు. గ్రామపంచాయతీలలో పన్ను వసూలు చేయాలని, అక్టోబర్ నెలాఖరు వరకు నిర్దేశించిన లక్ష్యాల మేరకు పన్ను వసూలు చేయాలన్నారు. పంచాయతీ కార్యదర్శి శ్రీలత ఉన్నారు.