తాను ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం రైతులకు అన్యాయం జరగనివ్వనని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. పెద్దపల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ లో గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వడ్ల కటింగ్ పేరున కట్ చేస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఈర్ల స్వరూప, డైరెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.