సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ పరంగా, కులాలకు సంబంధించి రాష్ట్రంలో జరిగే సర్వే దేశానికే ఆదర్శనీయంగా నిలుస్తుందని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. గురువారం మంథని సత్యసాయినగర్ లో సహకార బ్యాంక్ నూతన భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడారు. జిల్లా బ్యాంక్ సిఈఓ సత్యనారాయణరావు, బ్యాంక్ వైస్ చైర్మన్ పింగిలి రమేష్, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ పాల్గొన్నారు.