తిమ్మాపూర్ మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో శనివారం పెద్దమ్మతల్లి బోనాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు నెత్తిన బోనం ఎత్తుకొని డప్పుచప్పుళ్లతో ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు చల్లంగా ఉండేలా చూడాలని అమ్మవారిని వేడుకున్నామని సంఘ నాయకులు తెలిపారు.