శంకరపట్నంలో చాకలి ఐలమ్మ వర్ధంతి

64பார்த்தது
శంకరపట్నంలో చాకలి ఐలమ్మ వర్ధంతి
శంకరపట్నం మండల కేంద్రంలో మంగళవారం రజక సంఘం మండల అధ్యక్షుడు తాడిచెర్ల తిరుపతి ఆధ్వర్యంలో తెలంగాణ ముద్దుబిడ్డ వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి నిర్వహించారు. తిరుపతి మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం, ఆత్మగౌరవం కోసం, వీరోచితంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ అని ఆమె సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఎంపీఓ ప్రభాకర్, సూపరింటెండెంట్ రాఘవేంద్ర రెడ్డి, కుల బాంధవులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி