భారతీయ పోస్టల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ పోస్టుమాన్ & ఎం టి ఎస్ కరీంనగర్ డివిజన్ కార్యదర్శిగా ఓరుగంటి విష్ణువర్ధన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కరీంనగర్ ప్రధాన పోస్ట్ ఆఫీస్లో ఉద్యోగుల సమావేశం ఆదివారం నిర్వహించారు. అనంతరం ఎన్నికైన కార్యవర్గాన్ని బీఎంఎస్ జిల్లా అధ్యక్షుడు పసుల శ్రావణ్ ప్రకటించారు. ఈ సందర్భంగా విష్ణువర్ధన్ మాట్లాడుతూ.. పోస్టల్ ఉద్యోగుల హక్కుల సాధన సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు.