జగిత్యాల జిల్లా కేంద్రంలోని కరీంనగర్ రోడ్డు వైపు బైపాస్ చౌరస్తా వద్ద ఓ వ్యక్తిని శుక్రవారం రాత్రి ద్విచక్రవాహనం అతివేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాధిత వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్ ద్వారా జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముగ్గురు యువకులు ద్విచక్ర వాహనంపై అతివేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగిందని స్థానికులు తెలిపారు.