జగిత్యాల జిల్లా పరిధిలోని కోరుట్ల, ధర్మపురి, జిల్లాలోని పలు దేవాలయాల్లో చోరబడి విలువైన ఆభరణాలు, హుండీలలోని నగదు ఎత్తుకెళ్లిన ఊబుధి శేఖర్ ను బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు డీఎస్పీ రఘు చందర్ తెలిపారు. మరో నిందితురాలు లక్ష్మి పరారీలో ఉందని వివరించారు. ఈ మేరకు డీఎస్పీ కార్యాలయంలొ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వివరాలు వెళ్లడించారు.