ప్రస్తుత సీజన్ లో ప్రతి ఒక్క రైస్ మిల్లర్లు ప్యాడిని దిగుమతులు చేసుకోవాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా రైస్ మిల్లర్ల తో సమావేశం నిర్వహించారు. ముందుగా రా రైస్ మిల్లర్లు, బాయిల్డ్ రైస్ మిల్లర్లు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. ఎస్. లత, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.