బీర్పూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన పలు యంత్రాలకు రక్షణ కరువయ్యిందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొసైటీకి సంబందించిన వస్తువులు భద్రపరచడం కోసం గ్రామంలో ఓ గది అద్దెకు తీసుకుని అందుకోసం నెలకు రూ.6000 అద్దె చెల్లిస్తున్నారు. సుమారు 10 సంవత్సరాల నుండి ఈ గదికి అద్దె చెల్లిస్తున్నప్పటికీ విలువైన వస్తువులు ఎండకు ఎండుతూ వానకు నానుతూ ఉన్నాయి.