వీణవంక మండలం ఘన్ముక్ల గ్రామంలో ఆదివారం ఉదయం పిచ్చి కుక్క చేసిన దాడిలో అదే గ్రామానికి చెందిన కొత్తపల్లి వీరమ్మ, సూరమ్మకు తీవ్ర గాయాలు అయ్యాయి. మరికొందరికి స్వల్ప గాయాలు అయినట్లు గ్రామస్థులు తెలిపారు. మెరుగైన చికిత్స నిమిత్తం వారిని హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మండలంలో పిచ్చి కుక్కల బెడదను అధికారులు అరికట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.