జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ 3 రోజుల సెలవుల అనంతరం సోమవారం పునఃప్రారంభం కానుంది. శుక్రవారం కార్తీక పౌర్ణమి సెలవు, నిన్న, నేడు సాధారణ సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొచ్చి మంచి ధరలు పొందాలని అధికారులు సూచించారు. ఉదయం 9 గంటల లోపు మాత్రమే పత్తిని యార్డులోకి అధికారులు అనుమతించనున్నారు.