హుజురాబాద్ మామిండ్లవాడకు చెందిన అజయ్ కుమార్(20) డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేశాడు. ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రాకపోయేసరికి మనస్తాపానికి గురై శనివారం జమ్మికుంటలో మడిపల్లి రోడ్డు వద్ద పురుగుమందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రి నుండి మెరిగిన చికిత్స నిమిత్తం ఎంజిఎం కు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.