జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ స్థలాలను జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ శుక్రవారం పరిశీలించారు. రామాలయం గుట్టను సంబంధిత అధికారులతో కలసి పరిశీలించారు. గుట్ట ప్రాంతాల్లోని సర్వేనెంబర్ 735, 544 లో 125. 23 ఎకరాలలో ప్రభుత్వ కార్యాలయాలతో పాటు గుట్ట వెనకాల గృహాలు నిర్మించుకొని ఉన్న ఇండ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ రఘు వరుణ్ పాల్గొన్నారు.