గన్నేరువరం మండల కేంద్రంలో విద్యుత్ అధికారులు శనివారం పొలంబాట కార్యక్రమం నిర్వహించారు. కరీంనగర్ సర్కిల్ విద్యుత్ శాఖ సేఫ్టీ డిఇ విజేందర్ రెడ్డి, ఎఈ ఆంజనేయులు తో పాటు విద్యుత్ అధికారులు పర్యటించి రైతులు వ్యవసాయ బావులకు బోర్లకు కేపాసీటర్లు బిగించుకోవడం వలన కలిగే లాబాల గురించి వివరించారు. వ్యవసాయానికి మెరుగైన విద్యుత్ సప్లై అందించడానికి రైతు పోలం బాట కార్యక్రమం నిర్వహించామని అన్నారు.