గన్నేరువరం మండలంలో వీధి కుక్కలు బెడద తీవ్రంగా ఉంది. కుక్కల సంచారం వల్ల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. వీధుల్లో ఎక్కడపడితే అక్కడ ఉండే కుక్కలు మేకలు, గొర్రెలు, వ్యవసాయ కూలీలపై దాడి చేసి కరుస్తున్నాయి. వాహనాలపై వెళ్లే వారిని కూడా వెంబడించి కరుస్తున్నాయి. కుక్కల బెడద ఎక్కువగా ఉందని పశువైద్య అధికారులు సమస్యను పరిష్కరించాలని ఆదివారం పుల్లల జగన్మోహన్ కోరుతున్నారు.