ఎల్లారెడ్డి పట్టణంలోని 12వ వార్డులో గురువారం మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే మదన్మోహన్ ఆదేశాల మేరకు వారి ఇంటికి వెళ్లి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. బీద వర్గాల వారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని అన్నారు.