ఎల్లారెడ్డి మండలం వెల్లుట్లపేటకు చెందిన రాణాప్రతాప్ సింగ్ అనే వ్యక్తి లైసెన్సు లేకుండా తనవద్ద నాటు తుపాకీని పెట్టుకొని కోతులను, అడవిపందుల వేటకు వాడుతున్నాడని నమ్మదగిన సమాచారం మేరకు ఫారెస్ట్ అధికారులు శనివారం అతని ఇంట్లో సోదాచేసి నాటు తుపాకీని స్వాధీన పరచుకున్నట్లు ఎస్ఐ. బి. మహేష్ తెలిపారు. ఫారెస్ట్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేశామన్నారు.