మహిళా సాధికారతకు వీ-హబ్ తోడ్పాటు: పెద్దపల్లి కలెక్టర్
జిల్లాలోని మహిళల సాధికారత సాధన కోసం వీ-హబ్ తోడ్పాటు అందిస్తుందని, దీనిని వినియోగించుకొని మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. శుక్రవారం పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్ లో వీ- హబ్ ప్రతినిధులు, అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి సమావేశమయ్యారు. మహిళ సంఘాలచే ఏర్పాటు చేసే చిన్న, కుటీర పరిశ్రమలు, ఉత్పత్తులకు మార్కెటింగ్, లాభసాటి వ్యాపారం చేసేలా అవసరమైన శిక్షణపై చర్చించారు.