టిజి ఎన్పీడిసిఎల్ పెద్దపల్లి ఎస్ఈగా కంకటి మాధవరావు గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. కార్పొరేట్ కార్యాలయంలో క్వాలిటీ కంట్రోల్ విభాగంలో పనిచేసిన మాధవరావు పెద్దపల్లికి బదిలీ అయ్యారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్ఈ మాధవరావుకు విద్యుత్ శాఖ అధికారులు, ఉద్యోగులు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం ఆయనను ఘనంగా సన్మానించారు.