జిల్లాలో గత ఏడాదికంటే 60 శాతం అధికంగా ధాన్యం కొనుగోలు నేటికీ పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గురువారం ఒక ప్రకటనలో విడుదల చేశారు. పెద్దపెల్లి జిల్లాలో ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2023 లో నవంబర్ 21 నాటికి 6512 మంది రైతుల నుంచి 100 కోట్ల 30 లక్షల విలువ గల 45 వేల 439. 28 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 1762 మంది రైతులకు 25 కోట్ల పది లక్షల నగదు చెల్లించామని కలెక్టర్ తెలిపారు.