ఝార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఫలితాల్లో జేఎంఎం కూటమి ఆధిక్యం కనబరుస్తోంది. ప్రస్తుతం ఆ కూటమి ఆధిక్యాల్లో మ్యాజిక్ ఫిగర్(41)ని దాటింది. ప్రస్తుతం 43 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. మరోవైపు బీజేపీ కూటమి 27 స్థానాల్లో లీడ్లో ఉంది. ఇతరులు 3 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.