నిజామాబాద్ జిల్లా మోర్తాడ్, భీంగల్, ఆర్మూర్ ఎక్సైజ్ స్టేషన్ల నూతన భవనాలను నిజామాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా ప్రతి పల్లెలో గంజాయి, ఆల్ఫ్రాజోలం, గుడుంబా వంటి మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని మంత్రి ఆదేశించారు. మంత్రి వెంట ఎమ్మెల్యేలు డాక్టర్ భూపతి రెడ్డి, పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు.