తెలంగాణ విశ్వవిద్యాలయంలో 2014లో నియామకం పొందిన అధ్యాపకులకు రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులను అమలుపరుస్తూ పదోన్నతులు కల్పించాలని విశ్వవిద్యాలయ పరిపాలన భవనం ముందు గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఏ పున్నయ్య విశ్వవిద్యాలయ అధికారులను డిమాండ్ చేశారు.