మొహమ్మద్ నగర్ మండలంలోని హెడ్స్ జల విద్యుత్ కేంద్రానికి సంబంధించిన కబ్జాకు గురైనది తెలవడంతో 2008 భూభారతి సర్వే ప్రకారం 42 ఎకరాల భూమి జెన్కోకు సంబంధించినదని, అందులో 30 ఎకరాల భూమి మాత్రమే జెన్కో అధికారులు ఎక్కడ చూపిస్తే అక్కడ సర్వే నిర్వహించామని సర్వేర్ శ్రీకాంత్ తేల్చి చెప్పారు. జలవిద్యుత్ నిర్మాణ సమయంలో చేపట్టిన సర్వే రికార్డు జెన్కో అధికారుల వద్ద లేదని తేల్చి చెబుతున్నారు. ఇప్పటికైనా జెన్కో అధికారులు స్పందించి నిర్మాణ సమయంలో మ్యాపు ఆధారంగా సర్వే నిర్వహించాలని మండల వాసులు కోరుతున్నారు.