నిజాంసాగర్ మండల కేంద్రంలోని మండల విద్యా వనరుల కేంద్రం కొరకు మరుగుదొడ్లను అప్పట్లో నిర్మాణం చేపట్టారు. మరుగుదొడ్లు శిధిల వ్యవస్థకు చేరుకొని సంవత్సరాలు గడుస్తున్నా గాని అధికారులు పట్టించుకోవడంలేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నత అధికారులు స్పందించి నూతన మరుగుదొడ్లను నిర్మించి ఉపాధ్యాయుల సమస్యను తీర్చాలని శుక్రవారం కోరుతున్నారు.