ఎల్ఆర్ఎస్ సర్వేను పక్కాగా నిర్వహించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం పిట్లంలో కొనసాగుతున్న ఎల్ఆర్ఎస్ తీరును పరిశీలించారు. కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలిస్తూ, రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఏ. ఎన్. సి. సెంటర్ రిజిస్టర్ లను పరిశీలించారు. మందులను సక్రమంగా పంపిణీ చేయాలని, పనికిరాని ఎక్విప్మెంట్ లను తీసివేయాలన్నారు.