కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలోని గోర్గల్ గేటు వద్ద నూతనంగా నిర్మించిన, సొసైటీ ఫంక్షన్ హాల్ ని మంగళవారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిజాంసాగర్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చికోటి మనోజ్ కుమార్, వైస్ చైర్మన్ కృష్ణారెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.