తాడ్వాయి మండలంలోని (ఐకెపి) మండల సమైక్య కార్యాలయంలో మంగళవారం మండల అధ్యక్షురాలు శ్రీమతి యశోద అధ్యక్షతన మహిళ హక్కులు, చట్టాల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సమాచార హక్కుచట్ట పరిరక్షణ కమిటీ రాష్ట్ర డైరెక్టర్ ఎం. ఏ సలీం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఇటీవలే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు కొత్త చట్టాల గురించి అవగాహన కల్పించారు.