కామారెడ్డి జిల్లా ప్రజలకు కామారెడ్డి జిల్లా రైతు బంధు సమన్వయ సమితి అద్యక్షులు అంజిరెడ్డి గురువారం రాఖీ పౌర్ణమి శుభకాంక్షలు తెలిపారు. తాను కట్టే రాఖి సోదరుడికీ రక్షగా ఉంటుందని, అలాగే సోదరుడు కూడా తనకు రక్షగా నిలుస్తాడని భావిస్తూ కట్టే ఈ రాఖీ ప్రతి బంగారు తల్లికి వరం అన్నారు. కావున బంగారు తల్లులకు బహుమతిగా ఆదరణ, సమానత్వం, అన్నింటికన్నా ముఖ్యంగా వారికి మనమిచ్చే విద్య అమూల్యమైనదని అన్నారు.