బాన్సువాడ డివిజన్ పరిధిలోని కొత్తబాది గ్రామ శివారులో రోడ్డు వెడల్పు భాగంగా మరమ్మతు పనులు చేపట్టారు. దీంతో లారీపై వరి కోత యంత్రం రోడ్డుకు అడ్డంగా మంగళవారం దిగబడింది. ట్రాఫిక్ కు అంతరాయం కలగడంతో గంటల తరబడి వాహనదారులు వేచి చూస్తున్నారు. అస్తవ్యస్తంగా రోడ్డు విస్తరణ పనులు చేపట్టారని వాహనదారులు అంటున్నారు.