సీఎం రేవంత్ రెడ్డికి రక్షణ కవచంగా కమలదళం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విటర్ వేదికగా ఆరోపణలు చేశారు. దోస్తును కాపాడేందుకు 'చీకటి' రాజకీయమని, వారెవా తోడు దొంగల నాటకమని విమర్శలు గుప్పించారు. కిషన్ రెడ్డికి ఇప్పుడు మూసీ బాధితుల ఆక్రందనలు గుర్తొచ్చాయా? లగచర్ల ఘటన డైవర్షన్ కోసం కాదా మీ మూసీ నిద్ర? అని ప్రశ్నించారు. అకస్మాత్తుగా మూసీ బాధితులు గుర్తుకు రావడానికి వెనుకున్న మతలబేంటని నిలదీశారు.