మెట్ పల్లి పులపాలక కౌన్సిల్ సమావేశ మందిరంలో శనివారం మున్సిపల్ చైర్మన్ రణవేణి సుజాత సత్యనారాయణ అధ్యక్షతన సాధారణ సమావేశం నిర్వహించారు. సమావేశానికి కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ హాజరయ్యారు. సమావేశంలో మిషన్ భగీరథ పనులు చేస్తున్నప్పుడు ఏర్పడ్డ గుంటలని కూల్చాలని కొత్త మిషన్ భగీరథ కనెక్షన్లు మంజూరు చేయాలని కౌన్సిలర్లు కోరారు.