జగిత్యాల పట్టణంలోని టీఆర్ నగర్ 47, 48 వార్డులలో 25 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ సోమవారం భూమి పూజ చేసారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అడువాలజ్యోతి లక్ష్మణ్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, కమిషనర్ చిరంజీవి, కౌన్సిలర్లు చాంద్ పాషా, దేవేందర్ నాయక్, ఏ ఈ శరన్, నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు, వార్డు ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.