TG: కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. సంగారెడ్డి పట్టణంలో ఇటీవల నిర్వహించిన దసరా వేడుకల్లో రాష్ట్ర పక్షి పాలపిట్టను ఆయన ప్రజలకు చూపించారు. పంజరంలో బంధించిన పాలపిట్టలను జగ్గారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు బహిరంగంగా ప్రదర్శించారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972 ప్రకారం ఇలా చేయడం నేరం. దీంతో ఆయనపై అధికారులకు వన్యప్రాణుల సంరక్షకులు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.