మలయాళ ప్రముఖ రచయిత మంకొంబు గోపాలకృష్ణన్ (78) మృతిపై డైరెక్టర్ రాజమౌళి సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. "మలయాళ లెజండరీ రైటర్ మంకొంబు గోపాలకృష్ణన్ సర్ ఇక లేరన్నది తలచుకుంటే బాధగా ఉంది. ఆయన సాహిత్యం, కవిత్వం, సంభాషణలు ఎంతో ప్రభావం చూపాయి. ‘ఈగ’, ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ మలయాళ వెర్షన్లకు ఆయన పని చేసినందుకు కృతజ్ఞుడిని" అని రాసుకొచ్చారు.