హిందూ మత సంప్రదాయాల ప్రకారం తలస్నానం, గోళ్లు కత్తిరించడం వంటి పనులు ఏ రోజు పడితే ఆ రోజు చేయకూడదని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా మంగళవారం పెళ్లి కాని అమ్మాయిలు తల స్నానం చేయకూడదని సూచిస్తున్నారు. ఇలా చేస్తే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతకంలో కుజుడి స్థానం బలహీనంగా మారుతుంది. ఆ ప్రభావం వారి వివాహంపై పడుతుంది. సోదరుల పైనా దాని అశుభ ప్రభావం ఉంటుంది. అంతేకాకుండా ప్రతికూల శక్తి పెరుగుతుంది.