తమ ఆధీనంలో ఉన్న బందీలను ఇజ్రాయెల్, హమాస్ నేడు విడుదల చేయనున్నాయి. ఇటీవల కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోగా అందులో భాగంగా ఖాన్‌యూనిస్‌లో బందీల విడుదల ప్రక్రియ ప్రారంభం అయింది. ఈ క్రమంలో అలెగ్జాండర్ ట్రుఫనోవ్, సాగుయ్ డెకెల్ చెన్, యైర్ హార్న్‌లను హమాస్ విడుదల చేయనుండగా ప్రతిగా 369 మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.