వరుస వివాదాల్లో IPS అధికారి!

60பார்த்தது
వరుస వివాదాల్లో IPS అధికారి!
హైదరాబాద్ - గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఫెనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిధిలోని పబ్‌కు ఓ ఐపీఎస్ ఆఫీసర్ భార్యతో కలిసి వెళ్లారు. ఐపీఎస్ భార్య వాష్ రూమ్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా మదీనాగూడకు చెందిన ఓ డాక్టర్ చేయి తగిలింది. పొరపాటు జరిగిందని సదరు డాక్టర్ ఆమెకు సారీ చెప్పారు. ఆమె జరిగిన విషయాన్ని ఐపీఎస్‌ భర్తకు చెప్పింది. ఆ తర్వాత క్షణాల మీద గచ్చిబౌలి పోలీసులు పబ్‌కు చేరుకున్నారు. సదరు డాక్టర్‌ కావాల‌ని చేయ‌లేద‌ని చెప్పిన పోలీసులు అత్య‌త్సాహం ప్ర‌ద‌ర్శించి స్టేష‌న్‌లోనే ఉంచి మరుస‌టి రోజు నోటీసులు ఇచ్చి పంపారు.

தொடர்புடைய செய்தி