హైదరాబాద్ శిల్పారామంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి బజార్‌ను గురువారం సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. భారతదేశమంటే గ్రామాలేనని.. గ్రామాల్లో మహిళల అభివృద్దే సమగ్రాభివృద్ధి అని గవర్నర్ పేర్కొన్నారు. రూ.వేలకోట్ల విలువ చేసే శిల్పారామంలో దాదాపు 3.5 ఎకరాల స్థలాన్ని తెలంగాణ మహిళలకు అప్పగించామని, తమ నైపుణ్యాలతో మహిళా శక్తి బజార్‌ని హైదరాబాద్‌కి తలమానికం చేయాలని సీఎం అన్నారు.