AP: రాష్ట్రంలో కరెంట్ ఛార్జీలు పెంచమని సీఎం చంద్రబాబు వెల్లడించారు. గురువారం అమరావతిలోని తాళ్లాయపాలెంలో జీఐఎస్ సబ్ స్టేషన్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. పాత ప్రభుత్వం చేసిన దుర్మార్గ పనులు తమ ప్రభుత్వం చేయదని అన్నారు. పేదలపై విద్యుత్ భారానికి కారణం గత ప్రభుత్వమేనని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను తీర్చే బాధ్యత మనందరిది అని ప్రజలకు సూచించారు.